19, నవంబర్ 2010, శుక్రవారం

బ్లాగుల లోకి నా రాక


ముందుగ నేను బ్లాగు లోకంలోకి ఎలా వచ్చానో చెప్తాను. మా వారు మూడు సంవత్సరాల క్రితం పదవీ విరమణ చేసాక, కంప్యూటర్ కొన్నారు. అప్పటి వరకు ఆయనకి దాన్ని వాడటం తెలీదు.తరువాత నెమ్మదిగా నేర్చుకున్నారు. ఇంక అప్పటి నుంచి అదే లోకం. ఉదయం నిద్రలేచింది

మొదలు రాత్రి నిద్ర పోయేవరకు. తరువాత బ్లాగంటా

రు, మెయిలంటారు, నెట్అంటారు. ఇంకా ఇలాంటివే చాల క్రొత్త పదాలు వినిపించాయి. నాకు ఉత్సుకత పెరిగింది.

కంప్యూటర్ గురించి , బ్లాగుల గురించి తెలుసు కోవాలనిపించింది. నెమ్మదిగ కంప్యూటర్ చూడటం నేర్చుకున్నాను. బ్లాగులు చూడటం ప్రారంభించాను.

ఎవరి అభిప్రాయాలు (ఎవరికి తోచింది) వారు రాస్తున్నారు. నీకు ఒక బ్లాగు తయారు చేసి ఇస్తాను, నచ్చింది రాసుకోమన్నారు. ఇప్పుడిప్పుడే నా వేళ్లు కీ బోర్డు మీద కదుల్తున్నాయి.

అమ్మాయిలిద్దరికి పెళ్ళిళ్ళయ్యాయి. పురుళ్ళు, పుణ్యాలు అయ్యాయి. ఇద్దరు మనుమలు , ఇద్దరు మనుమరాళ్ళు కలిగారు. ఖాళీ సమయంలో పుస్తకాలు చదువుకుంటూ,స్తోత్రాలు వల్లిస్తూ కాలక్షేపం చేస్తున్నదాన్ని బ్లాగులోకంలోకి వచ్చి పడ్డాను.

ఇది టైపు చేయడానికి చాల సమయం పట్టింది.

ఇంకా బాగ సాధన చేయాలి. చేస్తాను. తరువాత మా

తిరుపతి, కంచి యాత్రా విశేషాలు చెప్తాను. ఇప్పటికంతే. ఉంటా మరి.

11 కామెంట్‌లు:

Weekend Politician (వీకెండ్ పొలిటీషియన్) చెప్పారు...

సుస్వాగతం :)

చెప్పాలంటే...... చెప్పారు...

స్వాగతం సుస్వాగతం :)

కొత్త పాళీ చెప్పారు...

స్వాగతమండీ

నైమిష్ చెప్పారు...

బ్లాగులోకానికి సుస్వాగతం...మరిన్ని అమ్మమ్మ కబుర్లు కోసం ఎదురుచూస్తూ ....

మేధ చెప్పారు...

Welcome to the blog world..

శ్రీలలిత చెప్పారు...

బ్లాగ్లోకం లోకి హృదయపూర్వక ఆహ్వానం..

పంతుల విజయ లక్ష్మి చెప్పారు...

ఈ అమ్మమ్మ చెప్పబోయే కబుర్లను ఆదరంగా ఆహ్వానించిన మీ అందరకీ నా ధన్యవాదాలు.

రాజేష్ జి చెప్పారు...

అమ్మమ్మగారికి సుస్వాగతం బ్లాగ్లోకానికి.

మీ తరం అనుభవాన్ని రంగరించి మంచి విషయాలు చెప్తారని భావిస్తూ..

కంచి కామాక్షమ్మ గురించి మొదలు పెట్టండి ఇంక.

జయ చెప్పారు...

అభినందనలండి. మరి బ్లాగ్ వనభోజనాల్లో ఏదీ మీ స్పెషల్ ?

మాలా కుమార్ చెప్పారు...

అభినందనలండి .
హపీ బ్లాగింగ్ .

ఇందు చెప్పారు...

బ్లాగ్లోకంలోకి స్వాగతం అండీ...మీరు చెప్పబోయే కబుర్లు వినడానికి మేమందరం సిధ్ధం :)