19, నవంబర్ 2010, శుక్రవారం

బ్లాగుల లోకి నా రాక


ముందుగ నేను బ్లాగు లోకంలోకి ఎలా వచ్చానో చెప్తాను. మా వారు మూడు సంవత్సరాల క్రితం పదవీ విరమణ చేసాక, కంప్యూటర్ కొన్నారు. అప్పటి వరకు ఆయనకి దాన్ని వాడటం తెలీదు.తరువాత నెమ్మదిగా నేర్చుకున్నారు. ఇంక అప్పటి నుంచి అదే లోకం. ఉదయం నిద్రలేచింది

మొదలు రాత్రి నిద్ర పోయేవరకు. తరువాత బ్లాగంటా

రు, మెయిలంటారు, నెట్అంటారు. ఇంకా ఇలాంటివే చాల క్రొత్త పదాలు వినిపించాయి. నాకు ఉత్సుకత పెరిగింది.

కంప్యూటర్ గురించి , బ్లాగుల గురించి తెలుసు కోవాలనిపించింది. నెమ్మదిగ కంప్యూటర్ చూడటం నేర్చుకున్నాను. బ్లాగులు చూడటం ప్రారంభించాను.

ఎవరి అభిప్రాయాలు (ఎవరికి తోచింది) వారు రాస్తున్నారు. నీకు ఒక బ్లాగు తయారు చేసి ఇస్తాను, నచ్చింది రాసుకోమన్నారు. ఇప్పుడిప్పుడే నా వేళ్లు కీ బోర్డు మీద కదుల్తున్నాయి.

అమ్మాయిలిద్దరికి పెళ్ళిళ్ళయ్యాయి. పురుళ్ళు, పుణ్యాలు అయ్యాయి. ఇద్దరు మనుమలు , ఇద్దరు మనుమరాళ్ళు కలిగారు. ఖాళీ సమయంలో పుస్తకాలు చదువుకుంటూ,స్తోత్రాలు వల్లిస్తూ కాలక్షేపం చేస్తున్నదాన్ని బ్లాగులోకంలోకి వచ్చి పడ్డాను.

ఇది టైపు చేయడానికి చాల సమయం పట్టింది.

ఇంకా బాగ సాధన చేయాలి. చేస్తాను. తరువాత మా

తిరుపతి, కంచి యాత్రా విశేషాలు చెప్తాను. ఇప్పటికంతే. ఉంటా మరి.

16, నవంబర్ 2010, మంగళవారం

చెప్పండి చూదాం !!


















ఈ చెట్టుని చూడండి. ఇది ఒక మామిడి చెట్టు. తమిళ నాట ఒక ప్రసిద్ధ శివ క్షేత్రంలో ఉంది.ఇది నిత్య హరితంగా 3500 సంవత్సరాల నుండీ అక్కడ ఉన్నదని అక్కడ దీని విశిష్టత గురించి వ్రాసి ఉంది. మరో విశేషం ఏమిటంటే, దీని ఫలాలు నాలుగు దిక్కులా నాలుగు రకాలయిన రుచులతో ఒప్పుతూ ఉంటాయని అంటారు.

ఈ వృక్ష రాజం ఏ దివ్య క్షేత్రంలో వెలసి ఉన్నదో చెప్పండి చూదాం !!

6, నవంబర్ 2010, శనివారం

ఒక మంచి ఆడియో వినండి ....




సంగీతమపి సాహిత్యం సరస్వత్యా: స్తన ద్వయమ్
ఏకమాపాత మధురరం, అన్యదాలోచనా2మృతమ్


ఈ ఆడియో వినండి మరి: